
ఓటీటీ

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. సెప్టెంబర్ 19న దీపిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఈ జంట సంయుక్తంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. “వెల్‌కమ్ బేబీ గర్ల్.. 19-09-2026. దువా, దీపిక, రణ్‌వీర్” అంటూ బేబీ పాదముద్రలతో కూడిన కార్డును పంచుకున్నారు.
దీపిక, రణ్‌వీర్ 2018లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. 2024 సెప్టెంబర్‌లో వీరికి తొలి సంతానంగా దువా జన్మించింది. తాజాగా మరో ఆడబిడ్డకు స్వాగతం పలకడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ శుభవార్తపై అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!