

ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన సూపర్‌నేచురల్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. సెప్టెంబర్ 25 నుంచి ‘అగధ’ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
‘అగధ’ కథ మహాదేవి (కామాక్షి భాస్కర్ల) చుట్టూ తిరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తులు కలిగిన ఆమె.. వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలు, తన సోదరి మహిమ (ఉల్కా గుప్తా) అనుమానాస్పద మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో అడవిలోని ఓ రహస్య గుహ, అదృశ్యమైన సింహా (శ్రవణ్ రెడ్డి), అతీంద్రియ శక్తి ‘అగధ’కు సంబంధించిన భయానక నిజాలు ఆమెకు ఎదురవుతాయి. ఈ మిస్టరీని మహాదేవి ఎలా ఛేదించింది? తన కుటుంబాన్ని ఆ శక్తి నుంచి ఎలా కాపాడుకుంది? అన్నదే సినిమా కథ.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!