
బిజినెస్

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులకు కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.213.59 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించింది. ఇందులో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, ఫైర్ స్టేషన్, ఈ అండ్ ఎం వర్క్‌షాప్, ఇతర అనుబంధ పనులు చేపట్టనున్నారు.

ఈ టెండర్ 2026 సెప్టెంబర్ 14న ప్రచురితమైంది. బిడ్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 3, 2026గా నిర్ణయించారు. ప్రీ-బిడ్ సమావేశం సెప్టెంబర్ 28న జరగనుంది. మొత్తం నిర్మాణ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికే మామునూరు విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయడంపై చర్చించాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!