
ఓటీటీ

ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత షూటింగ్ జట్టు పతకాల ఖాతాను యువ షూటర్ సైన్యమ్ విజ్ తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన చండీగఢ్‌కు చెందిన ఈ షూటర్ శుక్రవారం జరిగిన ఫైనల్‌లో 243.4 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
స్వర్ణ పతక పోరులో సైన్యమ్ విజ్‌కు తృటిలో నిరాశ ఎదురైంది. చైనా షూటర్ కిన్‌ఝన్ 243.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించగా, కేవలం 0.2 పాయింట్ల తేడాతో విజ్ స్వర్ణాన్ని కోల్పోయింది. ఇరాన్‌కు చెందిన రొస్తమియాన్ 221 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకుంది. ఈ విజయంతో భారత షూటింగ్ భవిష్యత్తుపై మరోసారి ఆశలు పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!