

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ఎపిసోడ్‌లో ‘మహా పరీక్ష’ మరింత ఉత్కంఠగా సాగింది. రెడ్, బ్లూ టీమ్‌ల మధ్య పోటీ కొనసాగుతుండగా.. ఈరోజు ఎపిసోడ్‌లో హై రిస్క్ జోన్ ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్ జోన్‌లోకి పంపాలని బిగ్ బాస్ ఆదేశించడంతో.. బ్లూ టీమ్ లీడర్ ఆటో రామ్ ప్రసాద్ స్వయంగా ముందుకొచ్చి తనను తాను రిస్క్‌లోకి పంపించుకున్నారు. మరోవైపు రెడ్ టీమ్ లీడర్ రోహిత్ నాయుడు ముందుకు రాకపోవడంతో చరణ్ హై రిస్క్ జోన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇంట్లో నాయకత్వం, బాధ్యత, సేఫ్ గేమ్‌పై చర్చలు మొదలయ్యాయి.
ఇక ఇంటి పనులు, టీమ్ బాధ్యతల విషయంలోనూ కంటెస్టెంట్ల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. టీమ్ లీడర్‌గా ఉన్న రామ్ ప్రసాద్ స్వయంగా రిస్క్ తీసుకోవడం ఆయన ఆటతీరుకు ప్లస్ పాయింట్‌గా మారగా.. రోహిత్ వ్యవహరించిన తీరు మాత్రం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే హై రిస్క్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్పడంతో ఇంటి సభ్యుల్లో టెన్షన్ పెరిగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ వంటి ట్విస్టులపై ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వాటిపై అధికారికంగా స్పష్టత రాలేదు.
మొత్తంగా చూస్తే.. మూడో రోజు ఎపిసోడ్ గత రెండు రోజులతో పోలిస్తే మరింత ఆసక్తికరంగా సాగింది. రామ్ ప్రసాద్ ఈరోజు ఎపిసోడ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్‌గా కనిపించగా, రోహిత్, చరణ్ వ్యవహారం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మొత్తం 16 మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో.. హై రిస్క్ జోన్ ట్విస్ట్‌తో ఇకపై గేమ్ మరింత కీలకంగా మారే అవకాశం ఉంది.

కామెంట్స్ (1)
Big Boss 10 🎉🎉