

యూఎస్ ఓపెన్ 2026 క్వార్టర్‌ఫైనల్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సెస్ టియాఫో, 22 ఏళ్ల అలెక్స్ మైకెల్సెన్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. తొలి రెండు సెట్లలో మైకెల్సెన్ అద్భుతంగా ఆడి 7-5, 6-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. దీంతో మిగిలిన మూడు సెట్లలో ఒక్కటి గెలిస్తేనే సెమీస్‌కు చేరే పరిస్థితి ఏర్పడింది. అయితే టియాఫో తన అనుభవాన్ని ఉపయోగించి పోరులోకి బలంగా తిరిగొచ్చాడు. మూడో సెట్‌ను 7-5తో, నాలుగో సెట్‌ను 6-3తో గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు.
చివరి సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. కీలక సమయాల్లో టియాఫో ఒత్తిడిని అధిగమించి టైబ్రేక్‌ను 7-6(10-6)తో గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. దాదాపు ఐదు గంటలపాటు సాగిన మ్యాచ్ అనంతరం ఓటమి బాధతో మైకెల్సెన్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే టియాఫో అతడిని ఆలింగనం చేసుకుని ఓదార్చాడు. యువ ఆటగాడిపై టియాఫో చూపించిన ఆప్యాయతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!