

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ టైటిల్‌కు మరింత చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసిన ఈస్ట్ జోన్.. బంతితోనూ సౌత్ జోన్‌ను కట్టడి చేసింది. మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 242/6తో నిలిచింది. వెటరన్ పేసర్ మహ్మద్ షమి, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసి సౌత్ జోన్‌ను దెబ్బతీశారు. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ తిలక్ వర్మ 56 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. సౌత్ జోన్ ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉండటంతో ఈస్ట్ జోన్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.
10 పరుగులకే రికీ భుయి వికెట్ కోల్పోయిన సౌత్ జోన్‌ను పడిక్కల్, జగదీశన్ కొంతవరకు ఆదుకున్నారు. జగదీశన్ 32 పరుగుల వద్ద ఔటైన తర్వాత షేక్ రషీద్ 27 పరుగులతో పడిక్కల్‌కు జత కలిశాడు. 126/2 వద్ద ఉన్న సౌత్ జోన్.. రెండు పరుగుల వ్యవధిలో రషీద్, పడిక్కల్ వికెట్లను కోల్పోయింది. అనంతరం తిలక్ వర్మ, స్మరణ్ 43 పరుగులు జోడించగా.. స్మరణ్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. తిలక్, శ్రేయస్ గోపాల్ కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో గోపాల్ 26 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం తిలక్‌కు మిలింద్ తోడుగా ఉన్నాడు. సౌత్ జోన్ ఫాలోఆన్ తప్పించుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోంది. మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా, ఫలితం రాకపోతే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతను నిర్ణయించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!