

ప్రముఖ ప్రొఫెషనల్ గోల్ఫ్ లీగ్ లివ్ గోల్ఫ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. న్యూజెర్సీలోని కోర్టులో Chapter 11 కింద దివాలా రక్షణ కోసం సంస్థ దాఖలు చేసుకుంది. పిటిషన్‌లో సంస్థకు 500 మిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల వరకు అప్పులు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, ఆస్తుల విలువ 100 మిలియన్ నుంచి 500 మిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు వెల్లడించింది. స్టార్ గోల్ఫ్ క్రీడాకారులు జాన్ రామ్, బ్రైసన్ డిశాంబో, డస్టిన్ జాన్సన్ సహా పలువురు ఆటగాళ్లకు లివ్ నుంచి భారీ మొత్తాలు బకాయి ఉన్నట్లు దాఖలైన పత్రాలు వెల్లడించాయి.
2022లో ప్రారంభమైన లివ్ గోల్ఫ్ కు సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) భారీగా నిధులు సమకూర్చింది. అయితే 2026 సీజన్ తర్వాత మరింత పెట్టుబడులు నిలిపివేయాలని PIF నిర్ణయించడంతో లీగ్‌పై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ, పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగేందుకు PIF సుమారు 49.6 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. BC Partnersతో ఒప్పందం చేసుకున్న లివ్ గోల్ఫ్, భవిష్యత్తులో ఆటగాళ్లకు మెజారిటీ యాజమాన్య భాగస్వామ్యం కల్పించే కొత్త విధానంతో లీగ్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!