

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైనప్పటి నుంచే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌కు చేరింది. గత సీజన్లలో తొలి వారం కంటెస్టెంట్లు కాస్త కుదురుగా కనిపించినప్పటికీ.. ఈసారి మొదటి రోజు నుంచే గొడవలు, వాగ్వాదాలతో హౌస్ వేడెక్కింది. 16 మంది కంటెస్టెంట్లలో కామనర్ కేటగిరీ నుంచి ‘అగ్ని పరీక్ష’ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ నాయుడు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. తొలి రోజే త్రిగుణ్‌తో జరిగిన వాగ్వాదంతో పాటు తన దూకుడైన ఆటతీరుతో రోహిత్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే సమయంలో అతడి మాట తీరు, ప్రవర్తనపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తూ.. కావాలనే గొడవలకు దిగుతున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు ఓటింగ్‌లో మాత్రం రోహిత్ టాప్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ వారం అతడికి 9 వేలకు పైగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అంట్లు తోమే బాధ్యతపై రోహిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గ్లౌజులు లేకపోవడంతో తరచూ పాత్రలు కడగడం వల్ల చేతులు గట్టిపడుతున్నాయని, మాయిశ్చర్ తగ్గిపోతుందని అతడు చెప్పినట్లు ప్రోమోలో కనిపించింది. దీంతో ‘అంట్లు కడగడానికి గ్లౌజులు కావాలా?’ అంటూ పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే రోహిత్ మాత్రం తన దూకుడైన శైలిని కొనసాగిస్తున్నాడు. హౌస్‌లో ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ ఉంటేనే టీఆర్‌పీ పెరుగుతుందని బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే ఫైర్‌తో రోహిత్ చివరి వరకు కొనసాగుతాడా? లేక మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!