
షోస్

అన్నవరం దేవస్థానంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు వాటర్ బాటిల్ విక్రయించిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. రూ.18 ఎమ్మార్పీ ఉన్న వాటర్ బాటిల్‌ను రూ.25కు విక్రయించినట్లు పిఠాపురానికి చెందిన డి. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్.. దుకాణదారుడిపై రూ.7 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కమిషన్ ఆదేశాల ప్రకారం.. అదనంగా వసూలు చేసిన మొత్తానికి తోడు ఫిర్యాదుదారుడికి రూ.10 వేల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలి. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు చెల్లించాలని దుకాణదారుడిని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!