

బీసీసీఐ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 కోసం సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ జట్లను ప్రకటించారు. సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ రజత్ పటిదార్‌ను ఎంపిక చేశారు. పవర్ హిట్టర్, రింకూ సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రజత్ నాయకత్వంలో సెంట్రల్ జోన్ టైటిల్ గెలుస్తుందని ఆర్సీబీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, షమ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీతో భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్, అనంతరం రంజీ ట్రోఫీ పోటీలు జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!