
జనరల్

బీహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లుకు పార్టీ మద్దతు తెలిపినప్పటికీ, బీహార్‌లో దాన్ని అమలు చేయడానికి పార్టీ అంగీకరించదని ఆయన అన్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత నీతీశ్ కుమార్ గతంలోనే తమ వైఖరిని స్పష్టం చేశారని రజక్ పేర్కొన్నారు.
2029 నాటికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో రజక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సెప్టెంబర్ 15న జేడీయూ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌధరి మాత్రం యూసీసీ బిల్లులోని నిబంధనలను పరిశీలించిన తర్వాతే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా ఈ అంశంపై అమిత్ షాతో చర్చించనున్నట్లు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!