
జనరల్

వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు డీసెంట్ బజ్ ఏర్పడగా, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో ఇకపై వరుసగా ప్రమోషనల్ అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. సెప్టెంబర్ 18 లేదా 19న థమన్ కంపోజ్ చేసిన తొలి పాటను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!