
బిజినెస్

వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం మొక్కజొన్నలకు రికార్డు ధర నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్‌కు రూ.2,750 ధర పలకడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. మార్కెట్ అధికారులు కూడా ఈ ధరపై హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా గర్నెపెల్లి గ్రామానికి చెందిన రాజరప్ప పోషాలు 18 బస్తాల మొక్కజొన్నలను ఏనుమాముల మార్కెట్‌కు తీసుకువచ్చారు. వ్యాపారులు ఆయన పంటను క్వింటాల్‌కు రూ.2,750 చొప్పున కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!