
సినిమాలు

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. డబ్లిన్ గార్డియన్స్ జట్టు యజమానిగా ఆయనను అధికారికంగా ప్రకటించారు. యూరప్‌లో క్రికెట్ అభివృద్ధి, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని ద్రవిడ్ తెలిపారు. డబ్లిన్‌లో ఇప్పటికే క్రికెట్‌కు మంచి ఆదరణ ఉందని, భవిష్యత్ తరానికి ఈ లీగ్ మంచి వేదికగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ లీగ్‌లో బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, రోటర్‌డామ్, ఆమ్స్టర్డామ్ జట్లు పాల్గొంటాయి. అభిషేక్ బచ్చన్, జాంటీ రోడ్స్, క్రిస్ గేల్, స్టీవ్ వా వంటి ప్రముఖులు కూడా ఈ లీగ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. తొలి సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!