
జనరల్

భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పారు. గురువారం సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనం చేసి ప్రజ్ఞానంద విజయం సాధించారు.
ఈ విజయంతో చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్‌లో తన తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందుకున్నారు. గ్రాండ్ చెస్ టూర్ చరిత్రలో తొలి భారతీయ విజేతగా నిలవడం భారత చెస్‌కు, ప్రజ్ఞానంద కెరీర్‌కు మరో కీలక మైలురాయిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!