

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుత జనగణనతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 816కు చేరనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెరగనుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయనే వివరాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యతో పాటు ప్రతిపాదిత పెంపు తర్వాత ఎన్ని స్థానాలు ఉండనున్నాయనే వివరాలను తెలియజేసే చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!