

బిగ్ బాస్ 10 తెలుగు డే 83 తొలి ప్రోమోలో హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్ వర్షిణితో కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వర్షిణిని లోపలికి పిలిచిన నాగార్జున.. ఈ వారం ఇంట్లో ఏం జరిగిందని అడిగారు. దీనికి సమాధానంగా ఇంట్లో అందరూ తమకు వ్యతిరేకంగా గ్యాంగ్ అవుతున్నారని వర్షిణి చెప్పింది. అంతేకాకుండా త్రిగుణ్ తనను ‘చీప్ క్యారెక్టర్’ అని అనడాన్ని తట్టుకోలేకపోయానని, ఆ వ్యాఖ్య తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించింది.
వర్షిణి చెప్పిన విషయాలు విన్న నాగార్జున.. ఆ తర్వాత త్రిగుణ్‌ను కూడా కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. అనంతరం అతడికి కొన్ని వీడియో క్లిప్స్ చూపించారు. ఇంట్లో జరిగిన పరిణామాలు, కంటెస్టెంట్ల మధ్య చోటుచేసుకున్న వ్యాఖ్యలపై నాగార్జున త్రిగుణ్‌తో మాట్లాడినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఈ వీడియోలు చూసిన తర్వాత త్రిగుణ్ ఎలా స్పందిస్తాడు? నాగార్జున్ అతడికి ఏం చెప్పబోతున్నారు? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!