

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్‌లో భారత్-ఎ జట్టుకు నిరాశ ఎదురైంది. శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఎ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. సినీత్ జయవర్ధన, లసిత్ క్రూస్పులె భారత బౌలర్లపై విరుచుకుపడి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

లసిత్ క్రూస్పులె 116 పరుగులతో, సినీత్ జయవర్ధన 105 పరుగులతో సెంచరీలు సాధించగా, నిషాన్ మధుష్కా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో శ్రీలంక-ఎ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టు బ్యాటింగ్‌లో రాణించినా బౌలింగ్‌లో పూర్తిగా విఫలమైంది. ఎనిమిది మంది బౌలర్లను ఉపయోగించినప్పటికీ శ్రీలంక బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయింది. హర్షిత్ రాణా, షెహ్‌బాజ్ అహ్మద్ మాత్రమే చెరో వికెట్ సాధించారు. ఈ విజయంతో శ్రీలంక ఫైనల్‌కు చేరగా, రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లలో విజేతతో ఆదివారం టైటిల్ పోరులో తలపడనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!