
రాజకీయాలు

బిగ్ బాస్ 10 తెలుగు రెండో ప్రోమోలో హోస్ట్ నాగార్జున.. కంటెస్టెంట్ అమన్‌ను ప్రశ్నించారు. గతంలో కెప్టెన్‌గా ఉన్న సమయంలో ముకేశ్‌తో అమన్ ప్రవర్తించిన తీరుపై ఆరా తీశారు. కెప్టెన్సీ బాధ్యతల్లో ఉన్నప్పుడు ముకేశ్‌తో ఎందుకు అలా వ్యవహరించాడనే అంశంపై నాగార్జున ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఇంట్లో చోటుచేసుకున్న విభేదాలు మరోసారి చర్చకు వచ్చాయి.
మరోవైపు ముకేశ్‌కు కూడా నాగార్జున కీలక సూచనలు చేశారు. తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవద్దని హితవు పలికారు. కంటెస్టెంట్ల ప్రవర్తనపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు రెండో ప్రోమోలో ఆసక్తిని పెంచాయి. ఈ సూచనలపై అమన్, ముకేశ్ ఎలా స్పందిస్తారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!