30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..

Writer: Chandrika 02:40 PM, 30 అక్టోబర్, 2026
టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..

అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అక్టోబర్‌ 29న షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన రషీద్‌ 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. జింబాబ్వే బ్యాటర్‌ టడివనాషే మరుమానిని ఔట్‌ చేయడం ద్వారా తన 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 120 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ రికార్డుతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ 153 మ్యాచ్‌ల్లో 171 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడికంటే రషీద్‌ ఖాన్‌ 29 వికెట్లు ఆధిక్యంలో ఉన్నాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడం ద్వారా అఫ్గాన్‌ స్పిన్నర్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

నాలుగో టీ20లో  భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

నాలుగో టీ20లో భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి

బాసెల్ టోర్నీలో జకోవిచ్‌కు షాక్.. స్ట్రఫ్ చేతిలో ఓటమి

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

సిరీస్ విజయోత్సాహంలో భారత్.. నాలుగో టీ20లో కొత్త మార్పులపై ఆసక్తి!

సిరీస్ విజయోత్సాహంలో భారత్.. నాలుగో టీ20లో కొత్త మార్పులపై ఆసక్తి!

ట్యాగ్లు
రషీద్ ఖాన్అఫ్గానిస్థాన్ క్రికెట్టీ20 అంతర్జాతీయ క్రికెట్200 వికెట్లుజింబాబ్వే వర్సెస్ అఫ్గానిస్థాన్ఆదిల్ రషీద్క్రికెట్ రికార్డులుషార్జా క్రికెట్అఫ్గానిస్థాన్ జట్టుఅంతర్జాతీయ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!
గాసిప్స్

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..
క్రీడలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు
జనరల్

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత
జనరల్

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత

‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!
గాసిప్స్

‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!