
జనరల్

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక ట్రేడ్ డీల్‌పై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యను రాజస్థాన్‌కు పంపి, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబయి జట్టులోకి తీసుకురావాలనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత యువ ఆటగాళ్లతో జట్టును బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముంబయి ఇండియన్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్ ముంబయికి వస్తే ఓపెనర్‌గా మాత్రమే కాకుండా భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలకు కూడా ప్రధాన అభ్యర్థిగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!