

అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. హైజంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజత పతకం సాధించగా, లాంగ్‌జంప్‌లో షానవాజ్ ఖాన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయాలతో అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హైజంప్, లాంగ్‌జంప్ విభాగాల్లో పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్లుగా ఇద్దరూ చరిత్ర సృష్టించారు.
రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల బసంత్ కుమార్ మేఘ్వాల్ హైజంప్‌లో 2.21 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజతం సాధించాడు. ఇదే ఎత్తును అల్జీరియాకు చెందిన యూనస్ అయాచీ, బ్రిటన్‌కు చెందిన ఓటిస్ పూల్ కూడా అధిగమించారు. కౌంట్‌బ్యాక్ ఆధారంగా పతకాలను నిర్ణయించగా, తొలి ప్రయత్నంలోనే 2.21 మీటర్లు దూకిన యూనస్‌కు స్వర్ణం, రెండో ప్రయత్నంలో ఆ ఎత్తును చేరుకున్న బసంత్‌కు రజతం, మూడో ప్రయత్నంలో అధిగమించిన ఓటిస్కు కాంస్యం లభించాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!