

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన లీ.. వైభవ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడని కొనియాడాడు. అతడి వయసుపై వస్తున్న చర్చలతో తనకు సంబంధం లేదని, ఆటగాడి ప్రతిభ, ప్రదర్శనే ముఖ్యమని పేర్కొన్నాడు. వైభవ్ భారత్‌కు దొరికిన గొప్ప వరమని, భవిష్యత్తులో మరెన్నో ఘనతలు సాధించే సత్తా అతడికి ఉందని అన్నాడు.
ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా పేసర్ల బౌలింగ్‌ను వైభవ్ ధైర్యంగా ఎదుర్కొన్న తీరును బ్రెట్ లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సీనియర్ బ్యాటర్లు ఇబ్బంది పడిన బంతులను సైతం వైభవ్ అవలీలగా హుక్ చేయడం తనను ఆకట్టుకుందని తెలిపాడు. సరైన క్రికెట్ షాట్లతో పాటు అపారమైన పవర్‌తో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. అయితే వైభవ్‌పై అనవసరమైన అంచనాలు, ఒత్తిడి పెంచకుండా అతడిని సహజంగా ఎదగనివ్వాలని లీ సూచించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!