

టీమిండియా బౌలింగ్ విభాగంపై మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ క్రికెటర్ కృష్ణంనాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు బౌలింగ్ వ్యవస్థ మొత్తం చూస్తే ‘పెడెస్ట్రియన్’గా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి బౌలింగ్ దళంతో భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశాలపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ పేసర్లు గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్‌లను తీర్చిదిద్దడంపై జట్టు మేనేజ్‌మెంట్ చూపిస్తున్న దృష్టిని శ్రీకాంత్ ప్రశ్నించారు.
ప్రధాన టోర్నీలకు ముందు టీమిండియా బౌలింగ్ లోతు, పేస్ వైవిధ్యంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్ వంటి ప్రతిభావంతులు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా నిరూపించుకునేందుకు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. జట్టు తీసుకుంటున్న ఈ ఎంపిక నిర్ణయాలు కీలక టోర్నీల్లో ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!