
సినిమాలు

జమ్మూ అండ్ కాశ్మిర్ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు చేరి అరుదైన ఘనత సాధించింది. సెమీఫైనల్ కు తొలిసారి అర్హత సాధించిన ఈ జట్టు, అదే ఉత్సాహంతో ఫైనల్ దశలోకి అడుగుపెట్టింది. బెంగాల్ పై కీలక పోరులో విజయం సాధిస్తూ తమ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయాన్ని రాసుకుంది.
చివరి ఇన్నింగ్స్ లో 126 పరుగుల లక్ష్యాన్ని చేధించిన జమ్మూ కాశ్మిర్ ఆత్మవిశ్వాసంతో విజయాన్ని అందుకుంది. స్టార్ పేసర్ ఔకిబ్ నబీ మ్యాచ్ లో మొత్తం తొమ్మిది వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శనతో జట్టు దేశీయ క్రికెట్ లో అత్యంత స్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!