

టీమిండియా పురుషుల జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ అసోం క్రికెటర్ సుభదీప్ ఘోష్‌ను బీసీసీఐ నియమించింది. పదవీకాలం ముగియడంతో టి. దిలీప్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనతో సుభదీప్ తన బాధ్యతలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌తో కలిసి ఆయన పనిచేయనున్నారు.
వివిధ వయో విభాగాల భారత జట్లతో పనిచేసి మంచి గుర్తింపు పొందిన సుభదీప్ ఘోష్ నియామకాన్ని అసోం క్రికెట్ అసోసియేషన్ స్వాగతించింది. మరోవైపు టి. దిలీప్ 2021 నుంచి 2026 వరకు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా "బెస్ట్ ఫీల్డింగ్ మెడల్" సంప్రదాయాన్ని ప్రారంభించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయన ఒప్పందాన్ని పొడిగించినప్పటికీ, ఈసారి బీసీసీఐ కొత్త కోచింగ్ మార్పులకు ప్రాధాన్యం ఇచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!