
సినిమాలు

ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా లాస్ ఏంజెలెస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇరాన్ 2-2తో డ్రా చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం ఇరాన్ కోచ్ అమీర్ ఘలేనోయి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికా విడిచి మెక్సికోలోని టిజువానా శిబిరానికి వెళ్లాలని తమకు ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు. విశ్రాంతికి కూడా సమయం ఇవ్వకపోవడం జట్టుకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచకప్‌లో తమ జట్టు అత్యంత అణచివేతకు గురవుతోందని ఘలేనోయి ఆరోపించారు. వీసా సమస్యల కారణంగా ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారులు, కోచింగ్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు జట్టుతో లేకపోవడం కూడా సన్నద్ధతపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు. బెల్జియంతో కీలక మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితులు జట్టుకు సవాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!