
సినిమాలు

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించింది. మూడో రౌండ్లో 58.65 మీటర్ల దూరం విసిరి పోటీలో ముందంజలో నిలిచింది. ప్రసవం జరిగిన కేవలం 11 నెలల్లోనే తిరిగి మైదానంలోకి వచ్చి ఈ విజయాన్ని అందుకోవడం విశేషం.
ఆ తర్వాతి రౌండ్లలో వరుసగా మూడు ఫౌల్స్ చేసినప్పటికీ, ఆమె ముందుగా సాధించిన దూరం కారణంగా కాంస్య పతకం ఆమె ఖాతాలోకి వెళ్లింది. కఠిన పరిస్థితులను అధిగమించి సీమా సాధించిన ఈ విజయంపై క్రీడా వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఆమె పట్టుదల, కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!