

ఐపీఎల్ 2026 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో ఓటమిని చవి చూసింది. లక్నో సూపర్ జెయింట్స్ 157 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రామ్ 45 పరుగులతో రాణించగా, కెప్టెన్ రిషభ్ పంత్ అజేయంగా 68 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన సమయంలో పంత్ మూడు బౌండరీలు బాది లక్నోకు కీలక విజయం అందించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ త్వరగా కుప్ప కూలింది. అయితే హెన్రిచ్ క్లాసెన్ (62), నితీశ్ కుమార్ రెడ్డి (55)లు ఐదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. పవర్ ప్లేలో మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చివర్లో లక్నో బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో ఎస్ఆర్హెచ్ 156 పరుగులకే పరిమితమైంది. ఆ స్కోర్‌ను లక్నో సులభంగా ఛేదించింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!