
జనరల్

టీజీ20 లీగ్ 2026లో భాగంగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కరీంనగర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే లీగ్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఖరారవడంతో పాటు క్వాలిఫయర్-1కు కూడా చేరుకుంటుంది.
మరోవైపు కరీంనగర్ డైమండ్స్ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ స్థానం మరింత బలపరచుకోవాలని చూస్తోంది. రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!