
క్రీడలు

టీజీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఖమ్మం 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. హిమతేజ కొడిమెల (45), మికిల్ జైస్వాల్ (30), సీవీ మిలింద్ (29*) రాణించారు.
ఛేదన సమయంలో వర్షం ఆటంకం కలిగించినా, మ్యాచ్ తిరిగి ప్రారంభమై ఖమ్మం విజయం సాధించింది. రైజర్స్ జట్టులో ఆదిత్య జవ్వాజి (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జ్ఞాన ప్రకాశ్ రెడ్డి (36) సహకరించాడు. ఖమ్మం బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు తీసి మెరిశాడు. హర్షిత్ సాయి, వేద్ రెడ్డి తలో 2 వికెట్లు సాధించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!