
ఓటీటీ

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండీ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 68 కిలోల విభాగంలో పోటీపడిన ముత్తుపాండీ రెండో స్థానంలో నిలిచి భారత్ ఖాతాలో మరో పతకాన్ని జోడించాడు. రిషికాంత్ సింగ్ సిల్వర్, మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించిన తర్వాత ముత్తుపాండీ కూడా తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని మరింత పెంచాడు.
తమిళనాడుకు చెందిన రాజా ముత్తుపాండీ విజయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అతడిని అభినందిస్తూ భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. యువ క్రీడాకారులకు ఇలాంటి విజయాలు స్ఫూర్తినిస్తాయని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!