

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత హాకీ జట్టు మరోసారి సత్తా చాటింది. 2026 ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భాగంగా అమ్స్టెల్వీన్‌లో జరిగిన పూల్-డీ చివరి మ్యాచ్‌లో భారత్ 5-3తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ టోర్నీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లగా.. పాకిస్థాన్ పూల్-డీలో మూడో స్థానంలో నిలిచి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ అద్భుత ప్రదర్శనతో చెరో రెండు గోల్స్ సాధించి భారత విజయానికి కీలకంగా నిలిచారు.
హర్మన్‌ప్రీత్ సింగ్ 5వ, 21వ నిమిషాల్లో గోల్స్ చేయగా.. అభిషేక్ 11వ, 24వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. అనంతరం హార్దిక్ సింగ్ భారత్ తరఫున మరో గోల్ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. పాకిస్థాన్ ప్రతిఘటించినప్పటికీ భారత ఆటగాళ్లు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని విజయాన్ని ఖాయం చేశారు. పూల్-డీలో భారత్, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో నిలిచి తదుపరి దశకు అర్హత సాధించాయి. ఈ విజయం భారత్‌కు టోర్నీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించడంతో పాటు చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!