

అర్జున్ దాస్, అదితి శంకర్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘వన్స్ మోర్’ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. విఘ్నేశ్ శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో ఆయన తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. విడుదలకు ముందు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అర్జున్ దాస్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దర్శకుడు విఘ్నేశ్ శ్రీకాంత్ తనకు కథ చెప్పినప్పుడు కొత్తగా, ఆసక్తికరంగా అనిపించడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు అర్జున్ దాస్ తెలిపారు. అయితే కథతో పలువురు ప్రముఖ నిర్మాణ సంస్థలను సంప్రదించిన దర్శకుడికి కొన్ని చోట్ల హీరోను మార్చాలనే సూచనలు ఎదురయ్యాయని చెప్పారు. అర్జున్ దాస్ స్థానంలో మరో స్టార్ హీరోను తీసుకుంటేనే సినిమాను నిర్మిస్తామని కొందరు చెప్పినా, శ్రీకాంత్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని వెల్లడించారు. తనపై దర్శకుడు ఉంచిన నమ్మకాన్ని సినిమాతో విజయంగా మలుస్తానని అర్జున్ దాస్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!