
జనరల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ స్పందించిన తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కొందరు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. క్రమశిక్షణా చర్యలపై ఆసక్తి నెలకొంది.
సోమవారం మెదక్ హౌసింగ్ బోర్డులోని వినాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా పీఏసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఈ అంశంపై స్పందించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఏఐసీసీ, పీసీసీకి సమర్పించామని చెప్పారు. పూర్తి నివేదిక అందిన తర్వాత ఈ అంశంపై ఏఐసీసీ పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారని మహేశ్ కుమార్ వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!