
క్రీడలు

ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుర్విందర్ సింగ్ 100 మీటర్ల పరుగులో సంచలన ప్రదర్శన కనబరిచాడు. 25 ఏళ్ల అతను 10.09 సెకన్లలో రేస్ పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. 10.10 సెకన్లలోపు పరుగును పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా కూడా చరిత్ర సృష్టించాడు. అతని టైమింగ్ ఆసియాలో రెండో అత్యుత్తమంగా నిలిచింది.
ఇంతకుముందు అనిమేష్ కుజుర్ సెమీఫైనల్లో 10.15 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు బద్దలైంది. ఫైనల్లో అనిమేష్ కుజుర్ 10.20 సెకన్లు, ప్రణవ్ గౌరవ్ 10.29 సెకన్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. 400 మీటర్ల విభాగంలో విశాల్ టీకే కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!