

శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనెకు దిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. ఇటీవల ముంబయి ఇండియన్స్ నుంచి వైదొలిగిన మహేలా.. ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా, గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. ఆయనకు ఉన్న కోచింగ్ అనుభవం, విజయవంతమైన రికార్డు తమ జట్టుకు ఉపయోగపడుతుందని దిల్లీ మేనేజ్మెంట్ భావిస్తోంది. డబ్ల్యూపీఎల్‌లో తొలి టైటిల్ సాధించడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టుకు జొనాథన్ బాటీ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. జెమీమా రోడ్రిగ్స్ నాయకత్వంలోని జట్టు ఈసారి ఆ లోటును భర్తీ చేయాలని చూస్తోంది. ఐపీఎల్లో దిల్లీ తరఫున కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన అనుభవం మహేలాకు ఉంది. ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా ఆ జట్టు టైటిళ్లు సాధించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవం దిల్లీ క్యాపిటల్స్‌కు ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!