

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తుది జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం వివాదానికి దారితీసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముందున్నప్పటికీ అతడిని పక్కన పెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా స్పందించారు. సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టులో అవకాశం కల్పించకపోవడానికి అతడి పేరే కారణమా? అంటూ ప్రశ్నించారు. ఈ ఎంపిక వెనుక మరో కారణం కనిపించడం లేదని ఆరోపించారు.
మరోవైపు సిరాజ్‌కు తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై వస్తున్న విమర్శలను టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ సమర్థించలేదు. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ కూర్పును పరిగణనలోకి తీసుకుని కెప్టెన్, జట్టు యాజమాన్యం అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశారని స్పష్టం చేశారు. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌లో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. జట్టు ఎంపిక నిర్ణయంలో తప్పేమీ లేదని కొటక్ పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!