
రాజకీయాలు

మౌంట్ మౌంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ కూర్పులో మార్పులు చేయడంతో పోటీపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తన జట్టులో ఏకంగా ఆరు మార్పులు చేశాడు. ఆరుగురు యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం కల్పించాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు జట్టు బెంచ్ బలాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. భారత్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను ప్రారంభించనుండగా, కొత్త కూర్పుతో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్‌కు ఈ పోరు కీలకంగా మారనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!