
జనరల్

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో బాలికపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి పల్మనరీ ఎంబాలిజం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మెరుగైన వైద్యం కోసం హేమంత్‌ను అధికారులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పల్మనరీ ఎంబాలిజం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ప్రస్తుతం అతడికి కర్నూలులో వైద్య చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!