

ది హండ్రెడ్ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదానికి దారి తీసింది. సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు యజమాన్యం సన్ గ్రూప్‌దే కావడం గమనార్హం. ఇదే గ్రూప్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్ స్వయంగా పాల్గొని పాక్ ఆటగాడిని ఎంపిక చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, ఆ కొనుగోలు ఐపీఎల్లో జరగలేదని, అది విదేశీ లీగ్ వేలంలో జరిగిన నిర్ణయమని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో జరిగే లీగ్‌లలో ఫ్రాంచైజీలు తీసుకునే నిర్ణయాల్లో బీసీసీఐకి సంబంధం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా పాక్ క్రికెటర్‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. భారీగా రిపోర్ట్ చేయడంతో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయినట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న చర్చలు క్రికెట్ వర్గాల్లో కొనసాగుతున్నాయి.
.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!