28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ

Writer: Pooja 10:50 PM, 27 జులై, 2026
E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ E20 పెట్రోల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. E20 ఇంధన విధానం వల్ల తన కుటుంబానికి వ్యక్తిగతంగా లాభం చేకూరిందని అసత్య ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం (జూలై 27) ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మెటా, గూగుల్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

గడ్కరీ తరఫు న్యాయవాది వాదిస్తూ, పరువు నష్టం కలిగించే కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో ఈ కేసును విచారించే అధికారం హైకోర్టుకు ఉందని తెలిపారు. దీనిని అంగీకరించిన న్యాయస్థానం దావా దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. AI సాయంతో తన పేరు, ఫోటో, గొంతును ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు కంటెంట్ రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని గడ్కరీ ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన విమర్శలకు తాను వ్యతిరేకం కాదని, కానీ తప్పుడు ఆరోపణలు, డీప్‌ఫేక్ ప్రచారంపై మాత్రమే చర్యలు కోరుతున్నానని గడ్కరీ స్పష్టం చేశారు. E20 అనేది 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఇంధనం. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్య నియంత్రణ, దేశీయ జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం కోసం కేంద్రం దీనిని ప్రవేశపెట్టగా, పాత వాహనాలపై దీని ప్రభావంపై కొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

ట్యాగ్లు
నితిన్ గడ్కరీఈ20 పెట్రోల్బాంబే హైకోర్టుడీప్ ఫేక్సోషల్ మీడియాపరువు నష్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్
గాసిప్స్

షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్

విరుష్క కొత్త ఇల్లు...సోషల్ మీడియాలో చర్చ
గాసిప్స్

విరుష్క కొత్త ఇల్లు...సోషల్ మీడియాలో చర్చ

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ
జనరల్

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్
జనరల్

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు
జనరల్

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి - హైకోర్టు

ఎలైట్ క్రికెట్ లీగ్ వేదికపై ‘అనకాపల్లి’ ట్రైలర్ సందడి
సినిమాలు

ఎలైట్ క్రికెట్ లీగ్ వేదికపై ‘అనకాపల్లి’ ట్రైలర్ సందడి

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌
జనరల్

జెన్‌ జీ రీల్స్‌ వాంతులొచ్చేలా ఉన్నాయి - కంగనా రనౌత్‌

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

కుటుంబ రిజిస్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కార్యాలయం క్లారిటీ
సినిమాలు

ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కార్యాలయం క్లారిటీ

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం
జనరల్

కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

కామన్వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం
క్రీడలు

కామన్వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!