
జనరల్

భారత యువ స్క్వాష్ సంచలనం అనహత్ సింగ్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుని స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. ఫైనల్ పోరులో ఈజిప్ట్‌కు చెందిన రుకాయ్యా సలెమ్‌ను ఓడించి ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ఇప్పటివరకు ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శనగా 2005లో జోష్నా చిన్నప్ప ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచారు. తాజాగా అనహత్ సింగ్ విజయం భారత స్క్వాష్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!