

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ముంబైలో రూ.18.29 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, "లండన్ కంటే ముంబైనే బెస్ట్?" అంటూ నెటిజన్లు సరదా చర్చలు ప్రారంభించారు.
సమాచారం ప్రకారం, ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, మూడు కార్ పార్కింగ్ స్థలాలు కలిగి ఉంది. ఈ ఆస్తి కొనుగోలులో రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఈ దంపతులు లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ, ముంబైలో ఈ భారీ పెట్టుబడి పెట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. అభిమానులు సరదా మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, పలువురు దీనిని విరుష్క జంట చేసిన మరో కీలక రియల్ ఎస్టేట్ పెట్టుబడిగా అభిప్రాయపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!