
గాసిప్స్

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కుటుంబ రిజిస్టర్ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యుల వివరాలు ఒకే అధికారిక రికార్డులో అందుబాటులో ఉండేలా ఈ విధానాన్ని అమలు చేయనుంది. కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ను మీ సేవ కేంద్రాలు, మీ సేవ ఆన్లైన్ పోర్టల్, యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు.
కుటుంబ రిజిస్టర్కు ప్రధాన ఆధారంగా రేషన్ కార్డును పరిగణించనున్నారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారికి తహసీల్దార్ ఆమోదం అనంతరం రెండు పని దినాల్లో సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతిస్తూ ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!