
గాసిప్స్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు. ఐసీయూలో వైద్యులతో మాట్లాడి చికిత్స తీరును సమీక్షించిన ఆయన, "ఎంజేస్తరో చేయండి... మా పెద్దిని కాపాడండి" అంటూ వైద్యులను భావోద్వేగంగా కోరారు.
వైద్యులు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నామని, విదేశీ నిపుణులతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు సహా కీలక అవయవాలు పనిచేస్తున్నాయని, మెదడు స్పందనపై స్పష్టత రావడానికి మరో 48 గంటలు సమయం అవసరమని చెప్పారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!