
గాసిప్స్

నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించిన జెన్ జీ నిరసనకారుల వైరల్ వీడియోలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన ఆమె, ఆ వీడియోలు తనకు అసహ్యం కలిగించాయని, వాటిని చూస్తే వాంతులొచ్చేలా అనిపించిందని వ్యాఖ్యానించారు. నిరసనకారుల భాష, ప్రవర్తనపై కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, హుందాతనానికి నిలయమని, అలాంటి విలువలకు విరుద్ధంగా ఈ తరహా ప్రవర్తన ఉందని కంగనా పేర్కొన్నారు. తమను తాము "బొద్దింకలు"గా పిలుచుకోవడం, ఆ విధంగానే ప్రవర్తించడం అసభ్యతను ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఈ వీడియోలు తనను తీవ్రంగా కలిచివేశాయని, కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనిపించిందని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!