

ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం అనహత్ సింగ్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన బార్బ్ సమేహ్‌ను నాలుగు గేమ్‌లలో ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ విజయంతో భారత స్క్వాష్‌లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 2005లో జోష్న చిన్నప్ప ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరగా.. రెండు దశాబ్దాలకుపైగా తర్వాత అనహత్ ఆ ఘనతను అందుకుంది. ప్రపంచ వేదికపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనహత్ ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జూనియర్ ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ఫైనల్ బరిలోకి దిగనుంది.
సెమీఫైనల్ విజయంపై స్పందించిన అనహత్.. ఫైనల్‌కు చేరడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. కొన్ని నెలల క్రితం బ్రిటిష్ జూనియర్ ఓపెన్‌లో బార్బ్‌తో జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగిందని, అందుకే ఈసారి మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందని ముందే తెలుసని చెప్పింది. గతంలో నాలుగుసార్లు ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ దశల్లో వెనుదిరిగానని గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఫైనల్‌కు చేరడం తన తల్లిదండ్రులు, కోచ్‌లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అయితే టోర్నీ ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. టైటిల్ పోరులో ఈజిప్ట్‌కు చెందిన రెండో సీడ్ రుకయ్యా సలెమ్‌తో అనహత్ తలపడనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!