
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్ నగరంలోని వాకా మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ పోటీలో ఆస్ట్రేలియా మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్ అర్ధశతకంతో రాణించగా, షఫాలీ వర్మ మరియు కశ్వీ గౌతమ్ కొంతమేర సహకరించారు. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగుల భారీ స్కోరు సాధించింది. సదర్‌ల్యాండ్ అద్భుత శతకంతో మెరిసింది, ఎల్లిస్ పెర్రీ అర్ధశతకం సాధించింది.
125 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరోసారి ఆసీస్ బౌలర్లకు తలొగ్గింది. ప్రతీక రావల్ 63 పరుగులతో పోరాడినా జట్టు 149 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత 25 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా సులభంగా లక్ష్యాన్ని చేధించింది. జార్జియా వాల్, లిచ్‌ఫీల్డ్ అజేయంగా నిలిచారు. బంతి, బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసిన సదర్‌ల్యాండ్‌కు మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు లభించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!